బాబుని వదల్లేకపోతున్న జీవీఎల్…కావాలనే బుక్ చేశారా..?

-

‘ఉరుము ఉరిమి మంగళం’ మీద పడినట్లు… మంత్రి కొడాలి నాని బీజేపీ నేతలని తిడితే, వరేమో నానిని తిట్టడంతో పాటు చంద్రబాబుని కూడా కలుపుని తిడుతున్నారు. అందరూ అలా చేయకపోయినా సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి వారైతా బాబుని మాత్రం తిట్టకుండా ఉండటం లేదు. తాజాగా కొడాలి నాని, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మోడీ, యోగిలు కూడా సతీసమేతంగా దేవుడు దగ్గరకు వెళ్లొచ్చుగా అంటూ మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు కొడాలి నానిపై విరుచుకుపడుతున్నారు. కొడాలిపై దారుణమైన విమర్శలు చేస్తూ, ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు సైతం కొడాలి వ్యాఖ్యలు వ్యక్తిగతమని, కేంద్రంలోని పెద్దలని అనడం కరెక్ట్ కాదన్నట్లు మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నానిపై విరుచుకుపడ్డారు. అహంకారంతో దేవుళ్లను, అత్యంత పవిత్ర హిందువులయిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దూషిస్తున్న కొడాలి నాని “కలియుగ” శిశుపాలుడు అని, వంద సార్లు మోదీని దూషించే దాకా ఆగి నారా చంద్రబాబు నాయుడు లాగా తమ పతనాన్ని కోరి తెచ్చుకుంటారో లేక వెంటనే తొలగించి ముఖ్యమంత్రి జగన్ తమ తప్పును గుర్తిస్తారో చూడాల్సి వుందని అన్నారు.

ఇక్కడ కొడాలినానిపై విమర్శలు చేస్తే ఇబ్బంది లేదు కానీ, జీవీఎల్ మాత్రం బాబు పేరు తెచ్చి మరీ విమర్శలు చేశారు. అంటే గతంలో బాబు, మోదీని తిట్టి శిక్ష అనుభవించరాన్నట్లు మాట్లాడారు. దీనికి 2019 ఎన్నికలే ఉదాహరణ అన్నట్లు పరోక్షంగా చెప్పారు. మోదీపై విమర్శలు చేశారని బాబుని కావాలనే బీజేపీ ఓడించిందనే చెప్పొచ్చు.

ఒకవేళ జగన్ కూడా తాప్పు దిద్దుకుపోతే బాబు గతే పడుతుందన్నట్లు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే నేతలపై విమర్శలు చేయడం సహజమే గానీ, జీవీఎల్ మాత్రం రాజకీయంగా దెబ్బతీస్తాం అన్నట్లు మాట్లాడుతున్నారు.  మరి చూడాలి రానున్న రోజుల్లో, జగన్ పట్ల బీజేపీ ఎలా నడుచుకుంటుందో..?

-vuyyuru subhash

Read more RELATED
Recommended to you

Exit mobile version