BRS… కాంగ్రెస్ కు వంత పాడుతుంది. ఈ రెండు పార్టీ లు పైకి మాత్రమే వేర్వేరు లోపల మాత్రం ఒక్కటే అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఇక డి లిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ద కార్యక్రమం. రాజ్యాంగ పర ప్రక్రియ కు రాజకీయ రంగు పులుముతున్నారు. కాంగ్రెస్ సంస్కృతే విభజించు పాలించు. పాలన చేత కాక కులాలను , మతాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నియోజక వర్గాల పునర్విభజనతో మోడీ, అమిత్ షా లు దక్షిణాది కి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
కానీ బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించింది కాంగ్రెస్.. 50 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లు పెరుగొద్ద. మహిళలు చట్ట సభల్లో అడుగు పెట్టకుండా అడ్డుపడుతున్నారా రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి. కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తుంది. బీజేపీ ఎదుగుదలను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు. అఖిల పక్షంకు ఎవరు వెళ్ళాలి అనేది రాష్ట్రఅధ్యక్షుడు నిర్ణయిస్తారు అని పేర్కొన్నారు.