‘అన్ని పార్టీలు రిజర్వేషన్ బిల్లును స్వాగతించాయి’

-

లేదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. ‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని కవిత కోరడం కాదు. కవిత వల్లే అయితే బీఆర్ఎస్ ఎంతమంది మహిళలకు సీట్లు ఇచ్చింది? ఎంతమంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు? అని’ లక్ష్మణ్ ప్రశ్నించారు. మరోవైపు దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లును స్వాగతిస్తున్నాయని ఆయన వివరించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన మహిళ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వెయ్యాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు అంటూ ఆయన పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసే బీఆర్ఎస్ మహిళల కోసం ఎన్ని సీట్లను కేటాయించిందో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మొదటి క్యాబినెట్ లో కనీసం ఒక్క మహిళ మంత్రి కూడా లేదు.. మీరు మహిళా బిల్లు మా పోరాటం వల్లే వచ్చిందంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

గతంలో యూపీఏ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినప్పటికి దాని మిత్ర పక్షాలే ఈ బిల్లును అడ్డుకున్నాయి. రాజ్యసభలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే మాటలు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో నిరూపిస్తుంది అని లక్ష్మణ్ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version