రేవంత్ రెడ్డి పై బీజేపి పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు

-

హోమ్ మినిస్టర్ అమిత్ షా డీప్ ఫేక్ వీడియో వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ప్రతినిధులపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది.

మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని , ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై బీజేపి పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తోన్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ వేదికపై మాట్లాడిన.. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేస్తోందని రేవంత్ రెడ్డి నేరుగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version