బీజేపీ ర్యాలీకి అనుమ‌తి లేదు : హైద‌రాబాద్ సీపీ ఆనంద్ స్ప‌ష్టం

-

బీజేపీ నిర్వ‌హించే ర్యాలీలో పాల్గొనేందుకు జేపీ న‌డ్డా హైద‌రాబాద్ కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేద‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ర్యాలీకి అనుమ‌తి ఇచ్చామ‌న్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. క‌రోనా నిబంధ‌న‌ల కార‌ణంగా రాష్ట్రంలో ర్యాలీలు, ధ‌ర్నాలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు ఎలాంటి అనుమ‌తి ఉండ‌ద‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉన్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విధిస్తున్న‌ ఆంక్ష‌లను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని న‌గ‌ర పోలీసుల‌ను సీపీ ఆనంద్ ఆదేశించారు. న‌గ‌రంలో బ‌హింర‌గ ప్ర‌దేశాల్లో ప్రజ‌ల‌ను గుంపులు గుంపులు జ‌మ కాకుండా చూడాల‌ని పోలీసుల‌కు సూచించారు.

అలాగే ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించారు. కాగ తానకు నిర‌స‌న తెలియ జేసే హ‌క్కు రాజ్యాంగం ఇచ్చింద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తు సికింద్రాబాద్ లో ఉన్న మ‌హ‌త్మ గాంధీ విగ్రాహానికి నివాళ్లు అర్పిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క పోతే త‌న‌కు పోలీసులు నోటీసులు ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలిపారు. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు చేసిన చేసిన ఈ ప్ర‌క‌ట‌నతో హైద‌రాబాద్ లో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version