కాంగ్రెస్ తో పొత్తు ఉండదని బెంగాల్ సీఎం మమతా ప్రకటించడంపై బీజేపీ స్పందించింది. విపక్షాల ఇండియా కూటమి త్వరలో కూలిపోతుందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు వాక్యానించారు. ‘ఆ కూటమి అసహజమైనది.
బెంగాల్ లో టీఎంసీకి వ్యతిరేకంగా సీపీఎం, కాంగ్రెస్ పోరాడుతున్నాయి. ఆమె నిర్ణయం కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ. మమత, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు లేకుండా ఆ కూటమి మనుగడ సాధ్యం కాదు’ అని విమర్శించారు.
కాగా ఇండియా కూటమికి నిన్న గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ సర్కార్ను కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో జరిగిన చర్చలు విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.