కేసీఆర్ ఫాంహౌజ్ మొత్తం కొంటాం అమ్ముతారా : రుద్రమదేవి

-

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపైఒకరు నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ టార్గెట్‌ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తాజాగా భూ నిర్వాసితుల నష్టపరిహారంపై మంత్రి హరీష్ రావుకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కౌంటర్ ఇచ్చారు. రూ.15 లక్షలకు ఎకరం చొప్పున కేసీఆర్ ఫాంహౌజ్ మొత్తం కొంటాం అమ్ముతారా అని ప్రశ్నించారు రుద్రమదేవి. తెలంగాణలో దౌర్భాగ్యపాలన నడుస్తోందని మండిపడ్డారు రుద్రమదేవి.

రాష్ట్రంలో 19 వేల మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రుద్రమదేవి.. ఈ ఆత్మహత్యలు ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. కామారెడ్డిలో రైతు ఆంజనేయులు ఆత్మహత్య బాధాకరమన్న రాణి రుద్రమ..జులైలో పంటనష్టం జరిగితే ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. నేషనల్ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5900లకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రుద్రమదేవి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version