Breaking : 7 అసెంబ్లీ స్థానాల్లో.. 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం

-

ఈ నెల 3వ తేదీన దేశంలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అదంపూర్ (హర్యానా), గోలా గోకర్నాథ్ (ఉత్తరప్రదేశ్), గోపాల్ గంజ్ (బీహార్), ధామ్ నగర్ (ఒడిశా) స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అయితే, తెలంగాణలోని మునుగోడులో బీజేపీకి ఓటమి ఎదురైంది. హోరాహోరీ పోరులో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అటు, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో రుతుజా లట్కే గెలిచారు. రుతుజా లట్కే… ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక బీహార్ లోని మోకమా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిని విజయం వరించింది.

1. హర్యానాలోని అదాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 16,606 ఓట్లతో గెలుపొందారు. ఈ స్థానంలో ఎప్పటి నుంచో మాజీ ఎమ్మెల్యే కుల్‫‭దీప్ సింగ్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. దీనికి అనుగుణంగానే తాజా ఫలితం వెల్లడైంది.
2. మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలేవీ పోటీలో లేకపోవడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన గెలుపు దాదాపు ముందే ఖరారైంది. అయితే స్వతంత్ర అభ్యర్థుల పోటీ వల్ల ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఆదివారం వెలువడిన ఫలితాల్లో శివసేన అభ్యర్థి రుతుజ లాక్టే 77 శాతానికి పైగా ఓట్లు రాబట్టి ఘన విజయం సాధించారు.
3. బిహార్‭లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కాగా ఇందులో ఒక స్థానాన్ని ఆర్జేడీ గెలుచుకుంది. మరొక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 2,000 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. ఇక గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుసుమ దేవి విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థిపై 1,100 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.
4. ఉత్తరప్రదేశ్‭లోని గోపాల్ గోక్రానాథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అమన్ గిరి విజయం సాధించారు. 34,000 మెజారిటీతో ఎస్పీ అభ్యర్థిని ఓడించారు. వాస్తవానికి ఈ ఉప ఎన్నికలో బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పోటీకి దూరంగా ఉండి ఎస్పీకి పరోక్షంగా మద్దతు ఇచ్చినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో బీజేపీకి ఎస్పీ పోటీ ఇవ్వలేకపోయింది.
5. ఒడిశాలోని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశి సూరజ్ గెలుపొందారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్‭పై 6214 ఓట్ల మెజారిటీని బీజేపీ అభ్యర్థి సాధించారు. వాస్తవానికి ఈరోజు బీజేపీ గెలిచిన స్థానాల్లో ధాంనగరే ప్రతిష్టాత్మకం. కారణం, ఈ రాష్ట్రంలో బీజేడీ రెండు దశాబ్దాలకు పైగా పాతుకు పోయి ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సీట్లు గెలుచుకోగలిగాయి కానీ, బీజేడీని పూర్తి స్థాయిలో నిలువరించలేకపోయాయి. అయితే తాజాగా ఒకే ఒక్క స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం గమనార్హం.
6. ఇక చివరగా.. తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం దిశగా ముందుకు పోతున్నట్లు ప్రస్తుతం ట్రెండ్స్ చూపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి 2,500పైగా ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. అయితే లెక్కింపు ముగింపు నాటికి ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version