మహాత్మా గాంధీని చంపిన చరిత్ర బిజెపిది – మంత్రి ఎర్రబెల్లి

-

జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సభ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, వరస్ట్ ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో బిజేపి పాత్రలేదని అన్నారు. గాంధీ జీ స్వాతంత్ర్యం కోసం శాంతియుత పోరాటం చేస్తే మహాత్ముడిని చంపించిన చరిత్ర బిజేపిది అని అన్నారు. అలాంటి బిజేపి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు ఏం చేయని బిజేపి ఇప్పుడు విమోచన వేడుకలతో రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతుందని.. తెలంగాణలో నిజాం కు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామన్నారు. ఆ పోరాటంలో పాలకుర్తి ప్రధాన భూమిక పోషించిందన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటయోదులు పాలకుర్తి ప్రాంతానికి చెందిన వారేనన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచనోద్యమ వేడుకలు నిర్వహిస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version