ఎన్నికల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకం : పేమా ఖాండు

-

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని సీఎం పెమా ఖాండు అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించిన సహకారానికి ప్రజలు తిరిగి చెల్లించారని పేర్కొన్నారు. బీజేపీకి మరో ఐదేళ్లు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. జూన్ 4న వెలువడే లోక్సభ ఎన్నికల ఫలితాలతో దేశం మొత్తం ఇదే జోరు విస్తరిస్తుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే… అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి రాజకీయాలకు ఈ విజయంతో ప్రజలు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. రాష్ట్ర వృద్ధి కోసం తమ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు సిక్కింలో విజయం సాధించిన SKM పార్టీకి, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగు ప్రధాని అభినందనలు తెలిపారు. సిక్కిం అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version