షారుఖ్ ఖాన్ అయినా బాలీవుడ్ ను ఆదుకుంటాడా.!

-

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ తప్ప ఏమి కనపడేది కాదు. వాటి వసూళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేవి. ఇక ముగ్గురు ఖాన్ లు తమ చరిష్మా తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేవారు. తర్వాత కాలంలో కంటెంట్ లేక , అదే మసాలా సినిమాలు చేయడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలు అయ్యాయి. ఈలోపు సౌత్ నుండి బాహుబలి 1,2 కేజీఎఫ్ 1,2, పుష్ప, కార్తికేయ, కాంతార వంటి సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి.

దీనితో బాలీవుడ్ లో అభద్రతా భావం పెరుగుతూ వచ్చింది. ఇక లాభం లేదనుకుని రాజమౌళి వంటి వారితో ప్రమోషన్ చేపిస్తూ బ్రహ్మాస్త్ర వంటి హిట్ సాధించారు. తర్వాత కూడా ఏవి మంచి సినిమాలు రాలేదు.తాజాగా పఠాన్ సినిమా మీద బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేని షారుఖ్ ఖాన్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా రిలీజైన టీజర్ అందరినీ అలరించింది. టీజర్లో విజువల్స్ షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా పై షారుఖ్ ఖాన్ అబిమానులు తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. బాలీవుడ్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం  జనవరి 26 న రిలీజ్ కానుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version