బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. వీటితో ఎన్నో సూపర్ హిట్స్‌ను కూడా అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. పూజాహెగ్డే హీరోయిన్. వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ఓ సౌత్ హిట్ ఫిల్మ్‌కు రీమేక్ అని గతంలో ప్రచారం సాగింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఇది ‘వీరమ్’ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. తెలుగులో పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశారు. శ్రుతిహాసన్ హీరోయిన్. ఇందులో నలుగురు తమ్ముళ్లకి అన్నయ్యగా పవన్ అభిమానులను అలరించారు. ఈ కథనే మార్పులు చేసి హిందీలో భాయ్ నటిస్తున్నారని ప్రస్తుతం సినీ వర్గాల టాక్. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
కాగా, ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంది. ఇందులో సల్మాన్ లాంగ్ హెయిర్‌తో ఎడారిలో నడుచుకుంటూ స్టైలిష్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు.ఇక సల్మాన్.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి నటిస్తున్న గాడ్ఫాదర్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో భాయ్.. చిరుతో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి.