ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై అధికార యంత్రాంగం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. జైలుకు మెయిల్ కూడా వచ్చింది. విచారణ ప్రారంభించారు. బాంబులు ఏవీ దొరకలేదు’ అని జైలు అధికారులు చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఢిల్లీని బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కలవర పెడుతున్నాయి. ఢిల్లీలో మొన్న స్కూళ్లకు, నిన్న ఆసుపత్రులకు, ఇవాళ తీహార్ జైలుకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.
ఇటీవలే స్కూళ్లు, ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన ఘటన మరకవ ముందే ఇప్పుడు మరోసారి అటువంటి మెయిల్సే వచ్చాయి. రెండు రోజుల క్రితమే రెండు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.