దక్షిణ కొరియాలో నివాస ప్రాంతాలపై బాంబులు

-

దక్షిణ కొరియాలోని నివాస ప్రాంతాలపై బాంబులు పడ్డాయి. ఆ దేశంలో ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ కలిసి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. KF 16 ఫైటర్ జెట్ నుంచి అకస్మాత్తుగా నివాస ప్రాంతాలపై 8 బాంబులు పడినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఐదుగురు సామాన్యులతో పాటు మరో ఇద్దరు సైనికులకు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.ఉత్తరకొరియా సరిహద్దులో ఉన్న పోషియాన్ సిటీలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, నివాస సముదాయాలపై బాంబులు పడటంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version