ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం పై స్పందించిన మంత్రి పొన్నం

-

ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై  గురువారం ఆయన స్పందించారు. ఈ విజయంతో రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనలేమికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ అభ్యర్థికి చెల్లని ఓట్లంత మెజార్టీ
కూడా రాలేదని అంతదానికే ఎందుకు అంత మిడిసిపాటు అని మండిపడ్డారు.

ఈ ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ  పని చేశాయని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఈ రెండు పార్టీల మైత్రి బంధాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఎటు ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారని పొన్నం అన్నారు.
ఓటమిపై సమీక్షించుకుంటామని.. ఈ ఓటమి భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపించదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version