రాష్ట్రానికి పైసా పెట్టుబడి తీసుకురావాలన్న ఆలోచన లేదు : బొండా ఉమా

-

మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విధ్వంసకరపాలన, అంతులేని అవినీతి, అడ్డూ ఆపులేని దోపిడీ, అన్నింటికంటే గొప్పదైన తన ముఖారవిందం చూసి ఏపీకి పరిశ్రమలు రావని, పారిశ్రామికవేత్తలెవరూ పైసా పెట్టుబడి పెట్టరని జగన్ రెడ్డికి అర్థమైందని, అందుకే ప్రపంచ ప్రఖ్యాత దావోస్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. “చంద్రబాబునాయుడి పాలనలో రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా, పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఉండేది. దావోస్ వేదిక మొదలు, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక, పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు చేసుకున్న రూ.16 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాల్ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే దుర్మార్గంగా రద్దు చేశాడు.

జగన్ అహంకారపూరిత నిర్ణయం, ప్రతి పారిశ్రామికవేత్తలను ఆలోచించుకునేలా చేసింది. దానిప్రభావమే నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ రాకపోవడం’ అని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5,17,000 కోట్ల పెట్టబడులు వచ్చాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానంపై జగన్ రెడ్డి ఏం చెబుతాడు? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర మంత్రి (కేటీఆర్) దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తుంటే… ఏపీ మంత్రి విశాఖలో కోడిపందేలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడని ఎద్దేవా చేశారు.’ అని బొండా ఉమా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version