ఉద్యోగులకు మంత్రి బొత్స వార్నింగ్… మాట్లాడేటప్పుడు జాగ్రత్త, పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి.

-

ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులను ప్రభుత్వ కమిటీ చర్చలకు ఆహ్వానించినా.. ఉద్యోగులను నుంచి స్పందన రాలేదు. మరోవైపు ఉద్యోగులు ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉద్యోగులు మాట్లాడేటప్పడు జాగ్రత్త వహించాలని.. వారు దుర్భాషలాడుతూ మాట్లాడే మాటలకు ఉద్యోగసంఘాల నేతలు బాధ్యత వహించాల్సి వస్తుందని.. పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మేం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. మేం మాట్లాడేలేక కాదు, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నామని.. మీరు కూడా హుందాగా మాట్లాడాలని సూచించారు. ఉద్యోగులను పలుమార్లు చర్చలకు ఆహ్వానించామని.. ఇప్పటికీ మూడు రోజుల నుంచి వేచిచూస్తున్నామని.. అయినా ఉద్యోగులు రాలేదని బొత్స అన్నారు. ఉద్యోగుల కోరికలు సమంజసంగా, చట్టబద్ధంగా ఉండాలని, రాష్ట్ర పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుని కోరికలు కోరాలన్నారు. ఓ పక్క నిరసన తెలియజేస్తూనే.. మరోవైపు ఒకటో తారీఖున జీతాలు కావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని… ప్రభుత్వం అందుకుతగ్గట్టుగానే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని బొత్స అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version