VIDEO VIRAL : బొత్స సత్యనారాయణ కాళ్ళు మొక్కిన కలెక్టర్

-

జనవరి ఒకటో తేదీ అంటే నిన్న ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ వేడుకల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారు. పుష్ప గుచ్చం తో వచ్చిన విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్… బొత్స సత్యనారాయణ కాళ్ల నొక్కుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారు షాక్ కు గురయ్యారు. రికార్డు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి.. ప్రజా ప్రతినిధి కాళ్లు మొక్కుతారా ? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా ఇటీవలే సిద్దిపేట కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version