హైదరాబాద్ కూకట్ పల్లిలోని సంగీత నగర్ లో దారుణం చోటు చేసుకుంది. పబ్జి గేమ్ ఆడనివ్వడం లేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..కూకటపల్లి లోనే మణికంఠ అనే బాలుడు ఓ ప్రైవేటు స్కూల్ లో చదువుతున్నాడు. అయితే.. ఆన్లైన్ క్లాసుల కోసం బాలుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు. మణికంఠ.. క్లాసులు వినకుండా.. పబ్జి ఆడటం మొదలు పెట్టాడు. అయితే గేమ్ లో పూర్తిగా విలీనమైన బాలుడు… అదే పనిగా ఆడడం మొదలు పెట్టేసాడు. గేమ్స్ లో పూర్తిగా లీనమైన అతని తల్లిదండ్రులు మందలించారు. తల్లిదండ్రులు మందలించారన్నా ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఊరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఆత్మహత్య కు గల కారణాలు సేకరిస్తున్నామని.. ఫోన్ లో కొన్ని గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించామని..పబ్జీ అడుతున్నాడా లేదా అన్నది దర్యాప్తులో తేలుతుందని కూకట్పల్లి సిఐ నర్సింగరావు తెలిపారు. ఆన్లైన్ చదువుల ఒత్తిడి కారణమా..లేక మొబైల్ లో గేమ్స్ ఆడటమే కారణమా అన్నది దర్యాప్తులో తెలుస్తామని స్పష్టం చేశారు.