అబ్బాయిలు అమ్మాయిల్లో అవి కూడా ఉంటేనే ఇష్టపడతారట..!

-

అబ్బాయిలకు అమ్మాయిలంటే అదో వీక్ నెస్ మరీ! మగవాళ్లకే ఎక్కువగా ప్రేమ, ఇష్టం ఉంటుందట. కానీ మగమహారాజులంతా అమ్మాయిలకు బానిసలేం కాదు. మనుషులకు అభిరుచుల్లో తేడాలున్నట్లు మహిళ విషయంలో కూడా రకరకాలైన కోరికలు ఉంటాయట. అయితే ఎవరూ ఎలాంటి వారిని కోరుకుంటున్నారు అనేది చెప్పటం చాలా కష్టం. కొన్నిసార్లు అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, మంచి అలవాట్లు ఉన్నా పురుషులకు నచ్చదు. దీనికి కారణం అమ్మాయిలు కాదు పురుషుల అభిరుచులు, కోరికలు, వారి ఆలోచనా విధానం అయి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉందండోయ్.. ఏంటంటే మగవారు మగువల్లో ఎక్కువగా ఒకటే కోరుకుంటారట.

couples

తనకు వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అనే విషయంపై పరిశోధకులు అధ్యాయనం నిర్వహించారు. ఈ పరిశోధన ప్రకారం పురుషులు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతారు, వేటి గురించి ఆశపడతారు అనే విషయాలను వెల్లడించారు. అమ్మాయికి అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారని అందరూ అంటుంటారు. కానీ పరిశోధన ప్రకారం ఇది నిజం కాదంట. మగవారు మగువల్లో బయటకి కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు, తనను తాను అందంగా ప్రజెంట్ చేసుకోగలిగే అమ్మాయిలంటే అబ్బాయిలు ఇంట్రస్ట్ చూపిస్తారట. అంటే మాటతీరు, ముస్తాబవ్వటం, డ్రస్సింగ్ సెన్స్ వీటికే పురుషులు ఎట్రాక్ట్ అవుతారట. అమ్మాయిలకు వ్యక్తిత్వానికి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ అబ్బాయిలకు మంచి వ్యక్తిత్వం అనేది మ్యాటరే కాదు.

అయితే అందరు మగవాళ్లు ఇలానే ఉండరు. మెజారిటీని బట్టి జరిగిన పరిశోధనలో కొందరు అందంతో పాటు తెలివితేటలను కోరుకుంటారు. అంతేకాదు.. ప్రతీ దానికి తన మీద ఆధారపడే మహిళలంటే పురుషులకు పెద్దగా నచ్చదట. వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. మగవారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న అమ్మాయినే ఇష్టపడతారట. తమ భాగస్వామికి చీటికి మాటికి కోపం రావటం, చిరాకు పడటం ఏ అబ్బాయికి నచ్చదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కుర్చోని మాట్లాడుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారట. అందువల్ల ప్రాబ్లమ్ ఈసీగా సాల్వ్ అవుతుందని పురుషుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version