ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్తుందని తెలుసుకున్న ఓ బ్రహ్మణుడు తన సమస్యల పరిష్కారం కోసం చేతిలో అర్జి పత్రంతో రోడ్డు పక్కన చేతులు జోడించి నిల్చున్నాడు. కాన్వయ్‌లో వెళ్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ కారులో నుంచి ఆ బ్రహ్మనుడిని చూశాడు. ఆ వెంటనే కారు ఆపాలని సెక్యూరిటీ బృందాన్ని కోరాడు.
వెంటనే ఆ బ్రాహ్మణుడు పవన్‌ను కలిసి తన సమస్యలను చెప్పుకున్నాడు. ఆపై పవన్ కళ్యాణ్ అతని సమస్యలను పరిష్కారించాలని అధికారులను ఆదేశించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక సాధారణ వ్యక్తి కోసం డిప్యూటీ సీఎం కారు ఆపి తన సమస్యలను విన్నారని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారని ఆ బ్రహ్మనుడు ఎంతో సంతోషించాడు. పవన్ కళ్యాన్‌ను కలువడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.