తెలంగాణాలో మరో రెండు కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణాలో మొత్తం ఇప్పటి వరకు 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కి వచ్చిన వారికి కరోనా వచ్చినట్టు గుర్తించారు. దీనిపై ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర కీలక ప్రకటన చేసారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అన్నీ సిద్దం చేసామని ఈటెల అన్నారు.
కరోనా తెలంగాణాలో ఎవరికి రాలేదని ఈటెల రాజేంద్ర చెప్పుకొచ్చారు. కరోనా సోకినా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన న్నారు. ప్రస్తుతం కరోనా అదుపులో ఉందని, కట్టడి చేయగలమని, ఎలాంటి పరిస్థితిని అయినా తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రేపు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి.
ఆయన అధికారులతో అక్కడి పరిస్థితిని చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కీలక అధికారుల నుంచి కెసిఆర్ సమాచారం సేకరించారు. ఇప్పటికే కరీంనగర్ లో అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మత ప్రచారంలో పాల్గొన్న వారి గురించి ఆరా తీస్తున్నారు. కాగా భారత్ లో కరోనా మరణాలు 5 కి చేరుకున్నాయి.