మోదీ పాలనలోకి వచ్చిన అనంతరం కొన్ని ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్.. దీని ద్వారా వచ్చిన ట్యాక్స్ ల వలన ప్రభుత్వం బాగానే వస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో GST ద్వారా వచ్చిన వసూళ్లు రికార్డ్ స్థాయిలో వచ్చాయని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. గత సంవత్సరం మే నెలలో GST ద్వారా వసూలు అయింది రూ. 140885 కోట్లు అయితే.. ఈ సంవత్సరం మే నెలలో రూ. 157090 కోట్లు వసూలు అయ్యాయి. గత మే నెలతో పోలిస్తే ఈ మే నెలలో 12 శాతం ఎక్కువగా వసూలు అయ్యాయి.
ఇక ఈ మొత్తం GST వసూళ్ళలో స్టేట్ ట్యాక్సులు రూ. 35828 కోట్లు కాగా, సెంట్రల్ ట్యాక్సులు రూ. 81363 కోట్లుగా ఉన్నాయి. ఇక సెస్సుల రూపంలో రూ. 11489 కోట్లు వసూలు చేయడం జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది.