బ్రేకింగ్; రాష్ట్రంలో ఒక్క రోజే 10 కరోనా కేసులు…!

-

కర్ణాటకలో కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేక పోతుంది అక్కడి ప్రభుత్వం. కరోనా వైరస్ అనేది దేశంలో ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. కర్ణాటకలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో అక్కడ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఐటి ఉద్యోగులు ఇతర దేశాలకు వెళ్లి ఇటీవల తిరిగి వచ్చారు.

వారిలో ఎంత మందికి కరోనా ఉంది అనేది ఇప్పుడు తెలియడం లేదు. బుధవారం ఒక్క రోజే కర్ణాటకలో 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కర్ణాటక దేశంలో మూడో స్థానంలో నిలిచింది. అక్కడ ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 51 కి చేరింది. వీరిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వారికీ అత్యంత జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా కరోనా వైరస్ అత్యంతవేగంగా విస్తరిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 10 వరకు పెరిగాయి. తెలంగాణాలో కరోనా కేసులు 41 కి చేరుకున్నాయి. కరోనాతో ప్రజలు అల్లాడుతున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version