తిరుమల తిరుపతి దేవస్థానంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది టీటీడీ. నగదు చెల్లింపు స్థానంలో యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద వసతి గదుల కేటాయింపు సమయంలో యూపీఐ విధానం ద్వారా చెల్లింపులు ప్రారంభించింది. త్వరలోనే టీటీడీకి సంబంధించి అన్ని చెల్లింపులో యూపీఐ విధానంలోనే చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. యూపీఐ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే అవకతవకలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి చొరవతో టిటిడి విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు రేమాండ్స్ అధినేత సింఘానియా. టిటిడి విద్యాసంస్థల ఆధునీకరణ పై దృష్టి సారించాలన్నారు. టిటిడి నిర్వహిస్తున్న 35 విద్యాలయాల నిర్వహణ బాధ్యతలు చేపడతామన్నారు. మరోవైపు పద్మావతి మహిళా జూనియర్ కళాశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు వచ్చారు దాత కొట్టు మురళీకృష్ణ. ఇప్పటికే పరకామని మండప నిర్మాణం కోసం 16 కోట్ల విరాళం అందించారు దాత మురళీకృష్ణ.