బ్రేకింగ్; ఏపీ పోలీసులకు హైకోర్ట్ షాక్…? చట్టం అందరికి సమానమే కదా…?

-

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైకోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. చంద్రబాబుకి 151 సిఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ కార్యకర్తలు ఆయనకు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ… విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసుల తీరుపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్ట్. “ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా?. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు..?” అని ప్రశ్నించింది.

151 సిఆర్పీసీ ఇవ్వాల్సింది నేరం చేసే ఉద్దేశం ఉన్న వాళ్లకు కదా అని హైకోర్ట్ ప్రశ్నించింది. అధికారపక్షానికి ఒక రూల్‌.. ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా?.. చట్టం ముందు అందరూ సమానమే కదా..? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని పోలీసులను ప్రశ్నించింది. మార్చ్ 2న కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని హైకోర్టు ఆదేశించగా విచారణను అదే రోజుకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version