సమగ్ర కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్తీక సోమవారం నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామివారికి గోపూజ నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు తెచ్చింది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక, దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమేనని పేర్కొన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తుంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.