బ్రేకింగ్: పోలీసు కష్టడీకి జేసీ బ్రదర్

-

నేడు పోలీసు కస్టడీకి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిని తీసుకుంటున్నారు అధికారులు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తారు. జేసీ తరపు న్యాయవాది సమక్షంలో ప్రభాకర్‌ రెడ్డిని ప్రశ్నించేందుకు ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు నుమతి ఇచ్చింది.

ఈ నెల 6న వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగం కేసులో బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో తాడిపత్రీ వచ్చే క్రమంలో ఆయన బొందల దిన్నె వద్ధ సిఐ దేవేంద్ర కుమార్ ను కులం పేరుతో ఆయన దూషించారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు అధికారులు. భద్రత పటిష్టంగా ఏర్పాటు చేసి ఆయనను కడప నుంచి అనంతపురం తీసుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version