BREAKING : “పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్” ల మూవీ నుండి బిగ్ అప్డేట్ !

-

https://twitter.com/IamSaiDharamTej/status/1659147849861599233?s=20

సినీ హీరోగా మరియు రాజకీయ నాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న పవన్ కళ్యాణ్ సరికొత్తగా మల్టీ స్టారర్ మూవీ చెయ్యడానికి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఇది కూడా తమిల్ లో ఇప్పటికే రిలీజ్ అయ్యి హిట్ సాధించిన వినోదయ సీతం కు రీమేక్ గా రానున్నది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా విలక్షణ నటుడు సముద్రఖని డైరెక్టర్ గా చేయనున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాకు టైటిల్ ను మరియు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. మొన్ననే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుండి గ్లిమ్ పస్ వీడియో రాగా… ఇప్పుడు మరో సినిమా నుండి అప్డేట్ రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందంలో తూలియాడుతున్నారు.

 

ఈ సినిమాకు ఇంతకు ముందు నుండి “BRO” అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. ఇప్పుడు అదే టైటిల్ ను అధికారికంగా ఫైనల్ చేశారు. విడుదల చేసిన మోషన్ పోస్టర్ అభిమానులను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version