బండి సంజయ్ కి మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ పై, ఆయన కుటుంబం పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలంతా కేసిఆర్ కుటుంబమే అని పేర్కొన్నారు ప్రశాంత్ రెడ్డి. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

బిజెపి వైఖరి వల్ల దేశ భద్రతకు పెనుముప్పు వాటిల్లుతుందని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని.. కేటీఆర్ చేసిన కృషి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయడం లేదని ఆరోపించారు. ఇకనైనా బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version