టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ ప్రకటించింది. అయితే గత కొంత కాలంగా రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ అవుతారని పలువురు మాజీ క్రికెటర్లు అన్నారు. ఆ వార్తలను నిజం చేస్తు ఈ రోజు బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యత లను రాహుల్ ద్రావిడ్ కు అప్పగించింది. అయితే ఇప్పటి వరకు టీమిండియా కు ప్రధాన కోచ్ గా రవి శాస్త్రి ఉన్నారు. ఆయన స్థానం లో టీ 20 వరల్డ్ కప్ ముగిసన తర్వాత నుంచి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా కొనసాగ నున్నారు.
రవి శాస్త్రి తో పాటు బ్యాటింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బౌలింగ్ కోచ్ బి. అరుణ్ కూడా తమ పదవీ కాలన్ని ముగించు కున్నారు. అయితే నూతనంగా హెడ్ కోచ్ గా ఎంపిక అయిన రాహుల్ ద్రావిడ్ ఎన్‌సీఏ కు దిశ నిర్ధేశం చేశాడు. అలాగే అండర్ – 19 జట్టు కు కోచ్ గా కూడా ఉన్నాడు. ద్రావిడ్ మాట్లాడుతు టీమిండియా కు హెడ్ కోచ్ గా ఎన్నిక కావడం తనకు దక్కిన గౌరవం గా భావిస్తున్నాని అన్నారు. అలాగే ఈ బాధ్యత కోసం తాను ఎదురు చూస్తున్నాని అన్నారు. ఆటగాళ్ల తో, సిబ్బంది తో కలిసి పనిచేయడానికి ఎదురు చుస్తున్నాని తెలిపారు.