ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఇక నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది . దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
కాగా, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135,జనసేన 21, బీజేపీ 8, వైఎస్సార్ సీపీలకు 11 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఆర్టికల్ 174 ప్రకారం కేబినెట్ సిఫార్సు తో గవర్నర్ అసెంబ్లీ రద్దు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక సీట్లు గెలవడంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.జూన్ 9న లేదా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.