తిరుమల శ్రీవారి ఆలయాన్ని మే 3 వరకు మూసి వేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. కరోనా నేపధ్యంలో గత 26 రోజుల నుంచి ఆలయాన్ని మూసి వేసారు. శ్రీవారికి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పూజలు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. దీనిపై కాసేపటి క్రితం ప్రకటన చేసింది.
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో ఇప్పుడు లాక్ డౌన్ ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఉదయం దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసారు. శ్రీవారి ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వాళ్ళు అందరూ ఇప్పుడు దేవాలయానికి వస్తే కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. ఇక స్థానికులు వచ్చినా సరే సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదు కాబట్టి కేసులు పెరగడం ఖాయం. అందుకే దేవస్థానాన్ని అధికారులు పూర్తిగా మూసి వేసారు.