చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు ఓటమితో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియా భారత జట్టుపై ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అయితే, టెస్టులు, టీ20లలో మాత్రం కొనసాగుతానని స్టీవ్ స్మిత్ వెల్లడించారు. ఇదిలాఉండగా, స్మిత్ క్రికెట్ ఆస్టేలియా తరఫున 170 వన్డేలు ఆడి 5,800 పరుగులు చేశారు. అందులో 12 సెంచరీలు ఉండగా.. 35 అర్థ సెంచరీలు ఉన్నాయి.