ఇటీవల ఆసియన్ గేమ్స్ లో ఇండియా మంచి ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఇలా పతకాలను సాధించిన క్రీడాకారులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వ నజరానాలు ప్రకటించింది. ఈ ప్రదర్శనలకు సరైన గుర్తింపు దక్కాలని భావించిన తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఇకపై ఒలింపిక్స్ మరియు ఇతర రాష్ట్ర స్థాయి, జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు శుభవార్తను అందించారు. ఇకపై పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ శాఖలు మరియు psu ల్లో 3 శాతం రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కల్పించడానికి నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జరీ చేసింది. దీని ద్వారా ఇకపై ఎవరైనా క్రీడలను లైఫ్ గా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది..
అయితే ఇందులోనూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు.. అవి ఏమిటన్నది తెలియాలంటే ఉత్తర్వులు బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ విషయం తెలిసిన తమిళనాడు క్రీడాకారులు మరియు యువత సీఎం స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.