కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఉచ్చు బిగిస్తోంది. కరోనా వేరియంట్ అధికంగా ఉన్నప్పుడు లాక్ డౌన్ వేళ నిబంధనలు వీటిన్నింటిని పట్టించుకోకుండా ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ పార్టీలో పాల్గొనడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సొంత పార్టీ నుంచే బోరిస్ జాన్సన్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా వేరియంట్ బ్రిటన్లో విలయతాండవం ఆడుతున్న వేళ తన ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలనే ప్రధాని పాటించకపోవడం విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంటే తాజాగా బోరిస్ జాన్సన్ పోలీస్ విచారణను ఎదుర్కొనున్నారు. విచారణ వేళ పలు ప్రశ్నలతో కూడిన లెటర్ ను పోలీసులు ఆయనకు అందించారు. వివరణ ఇచ్చేందుకు వారం గడువు ఇచ్చాడు. తన ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఉల్లంఘించినట్లు తేలితే..బోరిస్ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఆయన పదవి నుంచి స్వపక్షం నుంచి విపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.