కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ అడుగడుగునా కృషి చేసింది : కేటీఆర్

-

మేడే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు.‘ కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు. మీ రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుంది, మీ త్యాగం వెలకట్టలేనిది! చారిత్రాత్మక మేడే స్పూర్తితో, @BRSparty ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది.

సింగరేణి శ్రామికులకు బోనస్‌లు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించాం.TSRTC కార్మికులకు జీత భత్యాల పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించాం.ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డులతో అండగా నిలిచాం.తెలంగాణను పారిశ్రామిక ఆదర్శంగా నిలబెట్టి, లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించాం.మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం.కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం.ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news