రాష్ట్రంలో రెండో రోజూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు నిన్న బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలోనే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందంలా బీఆర్ఎస్ నేతలు ఊహల్లో గడుపుతున్నారని విమర్శించారు.

వారింకా అధికారంలోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ గత పదేళ్లలో విధ్వంసకర పాలన చేసిందని విమర్శించారు. కమీషన్లు అంటేనే కల్వకుంట్ల కుటుంబమని, ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. దుబాయ్ వేదికగా సోషల్ మీడియా ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలతో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలుపుతుంటే కావాలనే విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు.