కొంతమంది తనపై అవాకులు చవాకులు పేలుతున్నారు : మంత్రి పువ్వాడ

-

పొంగులేటి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించిన పలు సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పిచ్చికూతలు కూసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముస్తఫా లపై ఖమ్మం బీఆర్ఎస్ మైనారిటీ భాగం నాయకులు ద్వజమెత్తారు. వీడీఓస్ కాలనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజ్ఉద్దీన్, కార్పొరేటర్ మక్బూల్, మాజీ లైబ్రరీ చైర్మన్ ఖమర్, మాజీ కార్పొరేటర్ షౌకత్ అలీ, నాయకులు ఎస్కే ముక్తార్, మజీద్, ముజాహిద్, మెహబూబ్ అలీ, షేక్ షకీన, షంశుద్దిన్ మాట్లాడారు.. స్థాయి మరిచి మంత్రి పువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడనికి సిద్దంగా లేమన్నారు.

తనపై కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎన్ని రోజులు పదవిలో ఉన్నామనేది ముఖ్యంకాదని, ఎంత ప్రజాసేవ చేశామనేదే ముఖ్యమన్నారు. కొంతమంది సన్నాసులు తన గురించి తెలియక ఏదో మాట్లాడుతున్నారన్నారు. ఆ సన్నాసులంతా మొదట ప్రజాసేవ చేయాలని సూచించారు. కాగా, అంతకుముందు పొంగులేటి మాట్లాడుతూ.. ఆయనో బచ్చా అని విమర్శించారు. తనతో పోటీ చేసే అర్హత ఆ మంత్రికి లేదన్నారు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పువ్వాడ తీవ్రంగా స్పందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version