ఇవాళ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల అమలు ప్రచార సరళిసహా పార్టీపరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.