కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా చార్జిషీట్‌ను విడుదల చేశారు.ప్రశ్నించే గొంతులపై కేసులు పెట్టి వేధించడం, ఖాకీలతోనే పోలీసు కుటుంబాలపై దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.రేవంత్ పాలనలో ఒట్లు,తిట్లు తప్పా ఇంకేం లేదన్నారు. ప్రజాదర్బార్‌కు సీఎం రేవంత్, మంత్రులు ఎన్నిసార్లు వెళ్లారని ప్రశ్నించారు.ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని ప్రశ్నించారు.
రేవంత్ సర్కార్ ఎన్నికల హామీలు అమలులో విఫలమైందని, ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ మాట మార్చుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను అసెంబ్లీ, ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించిందని హరీష్ రావు స్పష్టం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయానికి గ్రహణం పట్టిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500 ఇస్తామని తెలంగాణ మహిళలను మోసం చేశారని విమర్శించారు.2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఫుడ్ పాయిజన్ ఘటనలు, పెంచిన పింఛన్ ఇవ్వకుండా అవ్వా తాతలకు వేధింపులు ఇలా మొత్తం 18 పేజీలతో కూడా చార్జిషీట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు.