నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తది : కేటీఆర్

-

తెలంగాణలోని నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చినా అమలు చేయడం లేదని నిరుద్యోగులు తెలిపారు.

జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. గ్రూప్-2లో రెండు వేల ఉద్యోగాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదు అని మండిపడ్డారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ చేశారు. తెలంగాణ యువత తరపున కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. గ్రూప్-2, 3 పోస్టులను పెంచుతామని ,జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఆ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే 10 నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండే.. ఇవ్వలేదు అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తది అని ఆయన అన్నారు.నిరుద్యోగులే కథా నాయకులై ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తది. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version