కానిస్టేబుళ్ల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం తెలిపారు. బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళనలు..వరుసగా పెరుగుతున్నాయి. డిచ్ పల్లి 7th బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపి, వారి సమస్యను విన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ సందర్బంగా బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుల్ల సమస్యలను తీర్చాలని సూచన లు చేశారు. తొందరగా ఈ సమస్యను తేల్చకుంటే పార్టీ తరఫున వారికి అండగా ఉండి… అవసరమైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.