ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు అనిరుధ్ రెడ్డి. తెలంగాణ ఆస్తులు కావాలి కానీ.. తిరుమలలో మా లెటర్ హెడ్స్ తీసుకోరా..? అంటూ విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ప్రజలు మమ్మల్ని గెలిపించారు.. మాకు ప్రోటోకాల్ ఇవ్వాలని పేర్కొన్నారు అనిరుధ్ రెడ్డి. తిరుపతి దేవస్థానానికి సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లలాంటివని చెప్పారని.. ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. అంటే సీఎం చంద్రబాబు ఇప్పుడొక కన్నును తీసేసుకున్నారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆంధ్రా నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు.