వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పిన BSNL .. త్వ‌ర‌లో 4G

-

ప్ర‌భుత్వ రంగ సంస్థ BSNL త‌న వినియోగ దారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక నుంచి BSNL కూడా 4జీ సేవలు అందించ బోతుంద‌ని ప్ర‌క‌టించింది. అందు కోసం ప్ర‌క్రియా ను కూడా మొద‌లు పెట్టామ‌ని తెలిపింది. వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దేవ వ్యాప్తంగా 4జీ సేవ‌ల‌ను ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్ర‌భుత్వ రంగ సంస్థ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తం గా కొన్ని ప్రాంతాల‌లో మాత్ర‌మే 4జీ సేవ‌లను అందిస్తుంది. చాలా చోట్ల ఇంకా 3జీ నెట్ వ‌ర్క్ మాత్ర‌మే వ‌స్తుంది.

కానీ ఇప్పుడు దేశ వ్యాప్తం గా 4 జీ సేవ‌ల‌ను విస్త‌రించ‌డానికి రంగం సిద్ధం చేస్తుంది. కాగ దేశ వ్యాప్తం గా 4 జీ సేవ‌లు విస్త‌రిస్తే BSNL కు దాదాపు రూ. 900 కోట్ల ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ BSNL కు 4 జీ సేవ‌లు లేక పోవ‌డం తో చాలా మంది ఇత‌ర నెట్ వ‌ర్క్ ల‌కు వెళ్లారు. అయితే ఇప్పుడు BSNL 4జీ సేవ‌లు ప్రారంభిస్తే క‌స్ట‌మ‌ర్ల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు బీఎస్ఎన్ఎల్ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యివేటు ప‌రం చేస్తార‌నే వార్తలు ఎక్కువ గా వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి ఆ ఆలోచ‌న లేద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డం తో బీఎస్ఎన్ఎల్ త‌న సేవ‌లను విస్త‌రించ‌డానికి సిద్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version