ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టిన బుచ్చిబాబు.. స్పోర్ట్స్ నేపథ్యంలో కథ!

-

అదృష్టం అంటే డైరెక్టర్ బుచ్చిబాబు సానదే అని చెప్పాలి. ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. సుకుమార్ శిష్యుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన.. ఈ మధ్యే ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు నమోదు చేసింది. ఏకంగా రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఈ హిట్ తో పలు బడా నిర్మాణ సంస్థలు.. పలువురు స్టార్ హీరోలు సైతం బుచ్చిబాబు దర్శకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించబోయో ప్రాజెక్ట్‌కే మళ్లీ బుచ్చి బాబు డైరెక్షన్ చేయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాని బుచ్చిబాబు ఓ టాలీవుడ్ స్టార్ హీరో చేయబోతున్నాడని స్వయంగా ఆయనే వెల్లడించాడు.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథను సిద్ధం చేసి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడని తెలుస్తోంది. ఈ కథ కూడా ఎన్టీఆర్ కు నచ్చడంతో.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీని మైత్రి మూవీస్, సుకుమార్ కలిసి నిర్మిస్తారంట. సుకుమార్ దగ్గర ఓనమాలు నేర్చుకుని.. పెద్ద హీరోలతో సినిమాలు చేసే ఆఫర్లు పట్టేస్తున్నాడు. కాగా బుచ్చిబాబు ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్టును రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఇయర్ లో అయిపోతుంది. ఆ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే తన 30వ సినిమా పూర్తి కాగానే.. బుచ్చిబాబుతో సినిమా ఉంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version