కారు కొనే వారికి బంపరాఫర్.. సులభంగా భారీ రుణం..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒకరు సొంత వాహనం కొనుకోవాలని యోచిస్తుంటారు. అయితే మీరు కూడా కారు కొనుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో తీసుకొచ్చింది ప్రముఖ కంపెనీ. ఏకంగా భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా అదిరిపోయే బంపరాఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది.

money

హోండా కార్స్ తాజాగా గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ఫెస్టివల్ ఆఫర్లకు తెరతీసిందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్‌షిప్స్ వద్ద పండుగ ఆఫర్లు పొందొచ్చునన్నారు. ఇవి అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇక ప్రస్తుత ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పండుగ సీజన్‌ను మరింత సంతోషకరంగా మార్చేందుకు ఈ కొత్త ఆఫర్లు తీసుకువచ్చామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేశ్ గోయల్ తెలిపారు. అయితే స్మార్ట్ ఫైనాన్స్ ఆప్షన్స్, ఈజీ ఈఎంఐ, ఎక్కువ కాలం టెన్యూర్ వంటి సౌలభ్యాలు ఉన్నాయని తెలిపారు.

అంతేకాకుండా హోండా అమేజ్ కారు కొంటే ఏకంగా రూ.47 వేల వరకు తగ్గింపు లభిస్తోందని తెలిపారు. ఇక హోండా సిటీ 5 జనరేషన్ కారుపై రూ.30 వేల వరకు, హోండా జాజ్ కారుపై రూ.40 వేల వరకు తగ్గింపు లభిస్తుందన్నారు. హోండా డబ్ల్యూఆర్ వీ‌ మోడల్‌పై రూ.40,000 వరకు, హోండా సివిక్ కారుపై రూ.2.5 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చునన్నారు. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌టెండెంట్ వారంటీ, హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వంటి వాటి రూపంలో ఈ తగ్గింపు లభిస్తోందని తెలిపారు. అంతేకాకుండా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు కారు ధరకు 100 శాతం ఫైనాన్స్ సమకూరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version