లోన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్.. క్యాష్ బ్యాక్ స్కీమ్ తో అకౌంట్లలోకి డబ్బులు..!

-

మీకు బ్యాంక్ లోన్ ఉంటే చాలు మీకు అదృష్టం వరించినట్టే. బ్యాంకులు లోన్ తీసుకున్న కస్టమర్లుకి ఒక శుభవార్త అందించింది. బ్యాంకులు లోన్ తీసుకున్న వారికి క్యాష్ బ్యాక్ స్కీమ్ ను అందిస్తున్నాయి. దీనితో సక్రమంగా ప్రతి నెలా ఈఎంఐ కట్టిన కస్టమర్లుకి మంచి బెనిఫిట్ కలగనుంది. మీరు లోన్ తీసుకుని.. సక్రమంగా ఈఎంఐ చెల్లిస్తూ వస్తున్నట్టయితే మీకు ఆర్‌బీఐ ఇచ్చే మారటోరియం బెనిఫిట్ లభిస్తుంది. బ్యాంకులు ఈరోజు నుంచే కస్టమర్ల అకౌంట్లలోకి డబ్బులు వేయనున్నాయి.

ఆర్‌బీఐ మారటోరియం బెనిఫిట్ పొందిన కస్టమర్లకు వడ్డీ మీద వడ్డీ మాఫీ బెనిఫిట్ అందిస్తుంది. అంటే లోన్ మారటోరియం పొందిన వారికి ఈ వడ్డీ మీద వడ్డీ డబ్బులు తిరిగి కాష్ బ్యాక్ రూపంలో వెనక్కి వస్తాయి. ఇది కేవలం లోన్ మారటోరియం పొందిన వారికే కాకుండా సక్రమంగా లోన్ ఈఎంఐ చెలిస్తూ వచ్చిన వారికి కూడా వడ్డీ మీద వడ్డీ మాఫీ డబ్బులు అంటే క్యాష్ ‌బ్యాక్ రూపంలో అకౌంట్లో జమ అవుతాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు లోన్ మారటోరియం సదుపాయం అందిస్తుంది. మార్చి నెల నుండి ఆగస్ట్ చివరి తేదీ వరకు ఇది వర్తిస్తుంది. లాక్ డౌన్ కారణంగా రుణ గ్రహీతలు పడ్డ ఇబ్బంది తీర్చాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5లోపు ఈ వడ్డీ మాఫీ స్కీమ్ ‌ను అమలు చెయ్యాలని ఆర్‌బీఐ బ్యాంకులను, ఇతర ఆర్థిక సంస్థలను ఆదేశించింది. ప్రస్తుతం ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణ గ్రహీతల కోసం వడ్డీ మీద వడ్డీ మాఫీ స్కీమ్‌ ను అమలు చేయనున్నాయి. ఈ స్కీమ్ ఈ రోజు నుంచే మొదలు కానుంది. కాబ్బటి సక్రమంగా నెల నెలా ఈఎంఐ కట్టిన కస్టమర్లుకి ఇప్పుడు అకౌంట్ లోకి కాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే చక్ర వడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version