బిజినెస్ ఐడియా: కీరా దోస సాగుతో అదిరే లాభాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచిగా రాబడి పొందొచ్చు. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఈ బిజినెస్ వలన ఉండదు. తక్కువ సమయంలోనే రాబడిని పొందడానికి కూడా అవుతుంది.

 

అదే కీరదోస సాగు. కీరా దోస సాగు తో అదిరే లాభాలు వస్తాయి. పైగా ఎప్పుడు కూడా దీనికి డిమాండ్ ఎక్కువే. ఇక మరి దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… కీర దోస ని పండించడం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించడానికి అవుతుంది. ఏ రకమైన మట్టి లోనైనా దీనిని మనం పండించవచ్చు.

ఇసుక, బంకమట్టి అయినా మరి ఏదైనా సరే కీరా బాగా పండుతుంది. వేసవిలో కీర కి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు దీనిని క్యాష్ చేసుకోవచ్చు. 60 నుండి 80 రోజుల్లో కీరా కాపుకి సిద్ధమవుతుంది. ఈ సాగు చెయ్యడానికి డబ్బులు కోసం ఆలోచించద్దు. ఎందుకంటే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి.

ప్రభుత్వం నుంచి 18 లక్షల సబ్సిడీ ని తీసుకుని రైతు పొలం లోనే సెట్ నెట్ హౌస్ నిర్మించుకోవచ్చు. అలా ఒక రైతు చేసాడు కూడా. సాధారణ కీరా దోసకాయ ధర కిలో 25 రూపాయలు ఉంది. ఏడాది పొడవునా అన్ని రకాల కీరాలకి కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు కీరదోస సాగు ని మొదలు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version