ఎక్కు వమంది ఈ మధ్య కాలం లో వ్యాపారాలని చేయడానికి చూస్తున్నారు మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని చేయాలని చూస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐడియా ని ఫాలో అవ్వండి. దీన్ని ఫాలో అవ్వడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు లోకి ఇప్పుడు వెళ్దాం.
బనానా పౌడర్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది చక్కటి లాభాలు ఈ బిజినెస్ ద్వారా వస్తాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అరటి పండ్లు ని పండిస్తున్నా లేదంటే మీరే స్వయంగా అరటి పండ్లు ని పండించి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు ఈ వ్యాపారం కోసం ముఖ్యమైనది అరటిపండు.
అలానే ఈ వ్యాపారం చేయడానికి బనానా డ్రయర్ మిషన్, మిక్సర్ మిషన్ కావాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో కానీ నేరుగా మార్కెట్ కి వెళ్లి కానీ కొనొచ్చు. అయితే మీరు ఈ పౌడర్ ని తయారు చేయడానికి అరటి పండ్లను సోడియం హైపోక్లోరిట్ తో క్లీన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అరటిపండ్ల పొట్టు తీసి సిట్రిక్ యాసిడ్ లో ముంచాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి 60 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో 24 అవర్స్ ఉంచాలి.
ఆరిపోయిన తర్వాత పౌడర్ చేయాలి ఈ పౌడర్ ని మీరు పాక్ చేయాల్సి ఉంటుంది ఐదు కిలోల వరకు మీరు దీన్ని రోజు కి అమ్మితే 5000 రూపాయలు వరకు వస్తాయి లేదంటే కనీసం నాలుగు వేల వరకు అయినా వస్తాయి. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అందుకే ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా మీరు ఈ బిజినెస్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.